జ్ఞాన సమాజాన్ని నిర్మించాలి


Wed,November 13, 2019 10:50 PM

గుండాల: జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ వంటి మహనీయులు కన్న కలలు నిజం చేయాలంటే ప్రతిఒక్కరూ చదువుకొని జ్ఞాన సమాజం వైపు పయనించాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు కోరారు. మంగళవారం రాత్రి వెల్మజాలలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే అక్షరంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. చీకట్లో ఉన్న మనం వెలుగులోకి రావాలంటే జ్ఞానం ఒక్కటే పరిష్కారమన్నారు. బడీడు పిల్లలను పనికి కాకుండా బడికి పంపించాలన్నారు. పిల్లల్లో దాగి ఉన సృజనాత్మకత, నైపుణ్యాన్ని వెలికి తీయాలని కోరారు. అనంతరం ఏపూరి సోమన్న కళాబృందం ఆట, పాట స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేరిపోతుల పరశురాములు, సర్పంచు సంగి బాలకృష్ణ, ఎంపీటీసీ సంగి అలివేలు, కవి, గాయకుడు ఏపూరి సోమన్న, ఉప సర్పంచ్ సింగారం పాండు, తంబడి పద్మారావు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles