ఘనంగా బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ


Wed,November 13, 2019 10:49 PM

బీబీనగర్: మండలంలోని రాయరావుపేటలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన బంగారు మైసమ్మ ఆలయంలో బుధవారం ఆమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ పాల్గొని అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొర్ర సంతోషారమేశ్, ఎంపీటీసీ ఎరుకల విజయలక్ష్మీపాండురంగం, ఉపసర్పంచు, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles