భూదాన్‌పోచంపల్లి: ప్రభుత్వ కశాశాలలు ప్రైవేట్ కళాశాలకు దీటుగా పనిచేస్తున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భువనగిరి రోటరీ క్లబ్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 10 కంప్యూటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రోటరీ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, డీఐఈవో చిలుక రమణి, ప్రిన్సిపాల్ విజయభాస్కర్‌రెడ్డి, కంప్యూటర్ దాతలు గుడిపాటి హరీశ్, బి. దామోదర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఫర్నిచర్ దాత ఎన్. రాజశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.