అమరుల త్యాగాలు మరువలేం


Tue,October 22, 2019 01:55 AM

-విద్రోహశక్తులపై నిరంతర పోరాటం
-కలెక్టర్ అనితారామచంద్రన్ ,డీసీపీ నారాయణరెడ్డి
- హనుమాపురంలో పోలీస్‌అమరవీరుల సంస్మరణ దినోత్సవం
-రక్తదాన శిబిరానికి విశేష స్పందన

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పోలీస్ అమరుల త్యాగాలు వృథాకావొద్దని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. సమా జ శ్రేయస్సుకు పాటుపడుతున్న పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు. సోమవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హనుమాపురంలోని జిల్లా పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా సంఘవిద్రోహ శక్తులతో పోరాడి ఈ ఏడాది 292 మంది పోలీస్‌లు అమరులయ్యారని గుర్తు చేశారు. అనుక్షణం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు వెనుకాడని వారు, సమాజ శ్రేయస్సుకు పరితపించేవారే నిజమైన పోలీసులన్నారు. పోలీస్‌లు చేస్తున్న త్యాగాలను, సేవలను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు. పోలీస్‌ల త్యాగాలు వెలకట్టలేనివని యాదాద్రి భువనగిరి జోన్ రాచకొండ కమిషనరేట్ డీసీపీ కే. నారాయణరెడ్డి అన్నారు. పోలీస్‌లు నిరంతరం ప్రజల రక్షణ కోసం పాటుపడుతున్నారన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసే క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు.

సమాజంలో పౌరుల రక్షణకు విధి నిర్వహణలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఒకప్పుడు నక్సలెట్లు.. ఇప్పడు అల్లరి మూకలు, ఐఎస్‌ఐ తీవ్రవాదులతో అనునిత్యం పోలీస్‌లు పోరాడుతున్నారన్నారు. జిల్లాలో రెండు దశాబ్దాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో 12 మంది అమరులయ్యారని గుర్తుచేశారు. అడిషనల్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ అమరవీరులు భౌతికంగా మన మధ్యలేకపోయినా ప్రజల మధ్య చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఎంతో ఆధునీకరించిందన్నారు. పోలీస్ ఉద్యోగం త్యాగాలతో కూడుకున్నదని భువనగిరి ఏసీపీ భుజంగరావు, ఏఆర్ ఏసీపీ కిష్టయ్య అన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

రక్తదానం కార్యక్రమానికి విశేష స్పందన ..
పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హనుమాపురంలో నిర్వహించిన రక్తదానం శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏఆర్ ఏసీపీ బీ. కిష్టయ్య చొరవ చూపించడంతో 174 మంది రక్తదానం చేశారు. డీసీపీ కే. నారాయణరెడ్డి కూడా రక్తదానం చేసి పోలీసులు, యువతను ప్రోత్సహించారు.

భువనగిరి డివిజన్‌లో..
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాపంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో అమర వీరుల చిత్ర పటాలకు, ఫ్లెక్సీలకు నివాళులర్పించాఆరు. ఈసందర్భంగా వారి సేవలను కొనియాడారు. భువనగిరి పట్టణ, రూరల్ పోలీస్‌స్టేషన్లతో పాటు, బీబీనగర్, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్లలో నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సైలు రాఘవేందర్‌గౌడ్, శివనాగప్రసాద్, రాజు, ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని రాచకొడ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

ఆలేరు నియోజకవర్గంలో ..
ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ టీ. మనోహర్‌రెడ్డి, సీఐలు నర్సింహారావు, ఆంజనేయులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలేరు పట్టణంలో ఎస్సై వెంకట్‌రెడ్డి , రాజపేట మండలంలో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు అమరవీరులకు నివాళులర్పించారు. నెమిల గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు భువనగిరిలో రక్తదానం చేశారు. ఆత్మకూరు(ఎం)లోని పోలీస్‌స్టేషన్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మంగమ్మ, ఎస్సై యాదగిరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బొమ్మలరామారం పీఎస్‌లో అమరవీరులకు ఎస్సై మధుబాబు నివాళులర్పించారు. తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, గుండాల మండల కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎస్సైలు, సిబ్బంది నివాళులర్పించారు.

చౌటుప్పల్ డివిజన్‌లో..
చౌటుప్పల్ డివిజన్ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడారు. చౌటుప్పల్‌లో ఏసీపీ సత్తయ్య పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...