ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి


Tue,October 22, 2019 01:51 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రమేశ్‌తో కలిసి కలెక్టర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సారి ధాన్యం దిగుబడి రెట్టింపు కానున్నదన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోళ్ల విషయంలో అంకితభావంతో పని చేయాలన్నారు. అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పనులను ప్రారంభించాలన్నారు. ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణను పర్యవేక్షించాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత, హమాలీ, రవాణా సమస్యలు లేకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పచ్చదనం-పారిశుధ్యం పనులకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...