బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి


Tue,October 22, 2019 01:51 AM

భువనగిరి, నమస్తేతెలంగాణ: బ్యాంకు రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. సోమవారం స్థానిక జయలక్ష్మీ యశోదగార్డెన్స్‌లో జిల్లా లీడ్ బ్యాంకైన కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో ఖాతాదారుల సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకులన్నీ ఒకేతాటిపైకి వచ్చి నేరుగా ఖాతాదారులకు రుణ సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. గృహ, వాహన, వ్యక్తిగత, వ్యవసాయ, ముద్ర రుణాలను తీసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు. పందిరి కూరగాయలు సాగు చేసే రైతులకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. కెనరాబ్యాంకు జనరల్ మేనేజర్ జి.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారుల చెంతకే బ్యాంకులు వచ్చి ఇస్తున్న రుణాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖాతాదారుల సేవా మహోత్సవంలో భాగంగా వివిధ బ్యాంకులు 3500 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.55 కోట్ల రుణాలను అందజేశాయి. కార్యక్రమంలో కెనరాబ్యాంకు రీజినల్ హెడ్ అలెగ్జాండర్, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగార్జునబాబు, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం యశోదాదేవి, ఎస్‌బీహెచ్ చీఫ్ మేనేజర్ భారతి, వ్యవసాయ అధికారి అనూరాధ, డీఆర్‌డివో ఉపేందర్‌రెడ్డి, పరిశ్రమల అధికారి హరిప్రసాద్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...