ఇక పట్టణ ప్రణాళిక...


Sun,October 20, 2019 11:55 PM

-మంత్రి కేటీఆర్ చొరవతో ప్రణాళికలు
-పల్లె ప్రణాళిక స్ఫూర్తితో మున్సిపాలిటీల్లో అమలు
- త్వరలో 20 రోజుల ప్రణాళిక కార్యాచరణ
- మొదటగా వార్డు వారీగా అవగాహన కార్యక్రమాలు
- పారిశుధ్యం, ఇతర సమస్యల గుర్తింపు
- పట్టణ ప్రణాళికకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న సర్కార్
- జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో 102 వార్డులు
- మొత్తం మున్సిపాలిటీల్లో జనాభా 1, 54, 034

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : పల్లెల్లో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తిలో మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 20రోజుల పట్టణ ప్రణాళికను అమ లు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నది. పట్టణాల్లో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కారంతో పట్టణాలు సుందరంగా మారనున్నాయి. జిల్లాలోని భువనగిరిలో 33 వార్డులు, భూదాన్ పోచంపల్లిలో 13వార్డులు, చౌటుప్పల్‌లో 20వార్డులు, యాదగిరిగుట్టలో 12వార్డులు, ఆలేరులో 12వార్డులు , మోత్కురు మున్సిపాలిటీలో 12వార్డులు అన్ని మున్సిపాలిటీల్లో మొత్తం 102 వార్డుల్లో 1, 54, 034 జనాభా నివసిస్తన్నారు. వీరికి కావాల్సిన సకల సదుపాయాలపై కూడా ప్రణాళికలు సైతం సిద్ధం కానున్నాయి. ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ కమిషనర్లతో సచివాలయంలోనుంచి మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.

పట్టణాల్లో ముఖ్యంగా పారిశుధ్యం, పచ్చదానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముందుగా వార్డు సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించనున్నారు. మం త్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మున్సిపల్ శాఖలో సమీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణాలను అభివృద్ధి పరిచేందుకు తీసుకోవవాల్సిన విధి విధానాలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొనే అవకాశం ఉండటంతో వార్డుల అభివృద్ధికి భారీగా విరాళాలు సేకరించడం కూడా సులువు అవుతుందని మంత్రి భావిస్తున్నా రు. సమస్యలు గుర్తించడం దగ్గర నుంచి అభివృద్ధి పనులు చేపట్టడం వరకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని మంత్రి కేటీ రామారావు నిర్ణయించారు.

పల్లెల తరహాలోనే పట్టణాల్లో కూడా ....
30రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారు. దీంతో గ్రామాలు సుందరవనంగా మారాయి. ఇక ఇదే తరహాలో పట్టణాలు కూడా త్వరలో ప్రగతి బాట పట్టనున్నా యి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మొదటగా వార్డుల వారీగా సభలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం ప్రతి వార్డుల్లో శ్రమదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి కేంద్రీకరించి పట్టణాలను సుందర నగరాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన మార్గదర్శకలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. పట్టణాల రూపురేఖలు మార్చి పట్టణాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు 20 రోజుల ప్రణాళిక కార్యక్రమాలను సిద్ధం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇందుకు సంబంధించి గత మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సచివాలయం నుంచి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా, పారిశుధ్య కార్యక్రమాలను సరైన విధంగా నిర్వహించేలా మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రణాళికలో గుర్తించి కార్యాచరణకు సిద్ధం కావాలని ఆదేశించడం జరిగింది. అదే విధంగా హరితహారంలో నాటిన మొక్కలు సరైన విధంగా బతికించేలా తగు చర్యలు తీసుకోవాలని, దీంతో పట్టణాలు పచ్చదనంతో సుందరంగా తయారు అవుతాయని తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు అందరి భాగస్వామ్యంతో ఇదే కార్యాచరణతో పట్టణాలను ప్రగతిబాట పట్టించాలని భావిస్తూ అధికారులు 20 రోజుల ప్రణాళికలో మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు..
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు భువనగిరి, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కురు ఉ న్నాయి. వీటిలో మొత్తం 102 వార్డులు ఉండగా మొత్తం జనాభా 1, 54, 034 మంది నివసిస్తున్నారు. త్వరలో రానున్న ప్రణాళికలో పట్టణాలను ప్రగతిబాటలో పయనించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది.

పట్టణ వాసుల్లో ఉత్సాహం..
గ్రామాల మాదిరిగా అందంగా తీర్చిదిద్ధేందుకు పట్టణ ప్రణాళిక కూడా ప్రగతి బాట పట్టేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పట్టణవాసుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించి పారిశుధ్యాన్ని తీర్చిదిద్ది అందమైన గ్రామాలుగా తయారు చేసి స్థానికంగా ప్రజలకు ఎలాంటి అపరిశుభ్రతతో రోగాల భారీన పడకుండా చక్కటి వాతావరణం కల్పించనట్లుగా పట్టణాల్లో కూడా అదే తరహాలో విజయవం తం చేస్తే సుందరంగా మారి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రణాళికలో అంశాలివే..
పట్టణంలో పారిశుధ్యాన్ని మొరుగు పర్చడం, మురుగునీటి గుంతలను పూడ్చడం, కాలనీల్లో గుంతల మయమైన రోడ్లను స్థానికుల సహాయంతో శ్రమదానంతో సరి చేయడం, విద్యుత్ సమస్యలను తీర్చడం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాట్లు, పార్కుల సుందరీకరణ, వ్యర్థనీటి శుద్ధీ కేంద్రాలు, పొడి చెత్త సేకరణ కేంద్రాలు, నిరూపయోగంగా మారిన బోర్లు, పురాతన భవనాలు, ఇండ్లను, సంవత్సరాలుగా పేరుకుపోయి న సమస్యలను ఇలా 20 రోజుల కార్యక్రమంలో తీర్చేందుకు యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతుంది.

వార్డు సభల్లో సమస్యల గుర్తింపు..
పట్టణ ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తూ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మొదటగా సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి ముందుకెళ్లడం అంశాలపై ప్రణాళికలో రూపొందిస్తున్నారు. పట్టణ వార్డు సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని పనులపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు రోడ్లపై చెత్త చెదారం వేయకుండా అవగాహన, తడి, పొడి చెత్త బుట్టల అవగాహన, ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయడం, రోడ్లపై చెత్త, దుకాణాల ఎదుట వ్యర్థపదార్థాలు వేయడం నేరమని అలా చేస్తే జరిమానాలు విధిస్తామని కాలనీ వాసులకు వివరించడం జరుగుతుంది. ఎవరైన ప్లాస్టిక్‌ను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఇందుకు ప్రభు త్వం కూడా ప్లాస్టిక్‌ను నిషేధించిందని తెలిపి ప్లాస్టిక్‌ను వినియోగించరాదని అవగాహన కల్పించడంపై దృష్టి సారించనున్నారు.

విద్యుత్ సమస్యలపై దృష్టి సారించి సమస్యలు ఉన్న చోట విద్యుత్ అధికారులు సరి చేయనున్నారు. శ్మశానవాటికలు, డంపింగ్ యార్డు ఏర్పాటు, ప్రతి ఇంటి, దుకాణ యజమాని తప్పనిసరిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలనే నిబంధనకు తోడు కొత్త నిర్మాణం జరుగుతున్న ఇంటి అవరణలో తప్పనిసరి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం, ఇప్పటికే ఇంకుడు లేకుండా నిర్మించుకున్న ఇంటి యజమానులకు ఇంకుడు గుంతల అవగాహన ఏర్పాటు చేసి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టి పట్టణాన్ని ప్రగతిబాటలో నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...