గుర్రపుడెక్కా తొలగింపు


Sun,October 20, 2019 11:53 PM

వలిగొండ : మండల పరిధిలోని గోకారం చెరువు నుంచి ధర్మారెడ్డి కాల్వ ద్వారా గొల్నెపల్లి రామసముద్రం చెరువులోకి వెళ్లే కాల్వలో గుర్రపు డెక్కా పేరుకుపోయింది. కాగా దివీస్ లేబొరేటరీస్ చౌటుప్పల్ వారి ఆర్థిక సహాయంతో జేసీబీతో ఆదివారం కాల్వలోని గుర్రపు డెక్కాను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తుర్కపల్లి మాధవీసురేందర్ మాట్లాడుతూ కాల్వ గుర్రపు డెక్కా, పూడిక తీతకు రూ.లక్ష విరాళం అందజేసిన దివీస్ లేబొరేటరీస్ ప్రతినిధులను అభింనందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దివీస్ లైజన్ అఫీసర్ వల్లూరి వెంకటరాజు, సీహెచ్ శివకోటేశ్వర్‌రావు, వినోద్‌కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...