చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి


Sun,October 20, 2019 11:53 PM

ఆలేరురూరల్ : చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మంతపురి గ్రామానికి చెందిన నోముల సత్తయ్యగౌడ్(50) గురువారం ఉదయం రోజుమాదిరిగానే కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. చెట్టు మీద ఉన్న పాము ఒక్కసారిగా సత్తయ్య కాలు మీద పడగానే భయంతో సత్తయ్య తాటి చెట్టు మీద నుంచి జారీ కింద పడ్డాడు. వెంటనే ఆలేరు ఏరియా దవాఖానకు తరలించి అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ చెక్కిల్ల మాధవీరవీందర్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...