హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Sun,October 20, 2019 11:52 PM

భూదాన్‌పోచంపల్లి : హుజూర్‌నగర్‌లో జరుగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 35వేల మెజార్టీ తో ఘనవిజయం సాధించడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్ యువజన విభా గం నాయకుడు చింతకింది కిర ణ్ సోదరుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం పోచంపల్లి మున్పిపాలిటీలోని ధరణి డెయిరీలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణలో సీఎం గా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయన్నా రు. గత ఎన్నికల్లో కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలుపొందరని తెలిపారు. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు రావడం మూలానే 6వేల తక్కువ మెజార్టీతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి గెలుపొందరని కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత ఐదు ఏళ్లుగా ఉత్తమ్ హయాంలో హుజూర్‌నగర్‌లో ఎలాంటి అభివృద్ధ్దికి నోచుకోలేదని ప్రజలు కూడా టీఆర్‌ఎస్ వైపుకు పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

మరో 4 ఏళ్లు టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉం టుంది కాబట్టి ప్రజలు కూడా అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధ్దికి బాటలు వే యాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. టీడీ పీ, బీజేపీ నామమాత్రంగానే పోటీ చేస్తుందని వారి ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రం పడుతున్నారే కాని గెలుస్తామనే ధీమా వారిలో లేదన్నారు. గతంలో వచ్చి న 12వేల ఓట్లు బీజేపీకి పడుతాయనే ఆ లోచనతోనే వారు ఉన్నారన్నారు. ఏది ఏమైనా సైదిరెడ్డి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ఆయన అన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు కోట మల్లారెడ్డి, ముత్యాల మహిపాల్‌రెడ్డి, ఐతరాజు భిక్షపతి, తడక రమేశ్, పగిళ్ల రామ్‌రెడ్డి, నో ముల ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...