ట్రాక్టర్లు వచ్చేస్తున్నయ్..!


Sat,October 19, 2019 11:13 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో చెత్తాచెదారం తొలగింపుతో సంపూర్ణ పారిశుధ్యం.. హరితహారంలో మొక్కల సంరక్షణకు నీటి సరఫరా.. ఆయా గ్రామాల్లో ప్రజలు నెలకొన్న వివిధ సమస్యలు.. ఇలా పలు ప్రయోజనాలకు ట్రాక్టర్లు సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో కదిలిన జిల్లా యంత్రాంగం కొనుగోలుకు కసరత్తు మొ దలు పెట్టింది. ఈ నెల 25వ తేదీలోపు వాటిని కొనుగోళ్లు చే యాలని స్పష్టం చేశారు. ప్రతి పనికి ట్రాక్టర్లను ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. పంచాయతీలకు అద్దె భారం పడుతుంది. ఒకవేళ అద్దె ఇచ్చిన పలు సందర్భాల్లో ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం పంచాయతీలకే ప్రత్యేక వాహనాలు అందజేస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని ట్రాక్టర్లను అందజేసే ప్రక్రియను మొదలు పెట్టిం ది. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆయా గ్రామాల్లో ఇన్నాళ్లు ప్రజలను వెంటాడిన సమస్యలు తొలగిపోతున్నాయి. పక్కా ప్రణాళికతో సమగ్ర అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. పరిశుభ్రత, పచ్చదనం ఆవిషృతం కాబోతున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నాయి. ఈ నేథ్యంలో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చేందుకు నిర్ణయించింది. ఆయా గ్రామ పంచాయతీ నుంచి రిక్వైర్‌మెంట్ తీసుకుని ట్రాక్టర్లు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ లేదా కచ్చితంగా ఉండాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయా గ్రామ పం చాయతీ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా మినీట్రాక్టర్ లేదా ట్రాక్టర్ల కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

కొనుగోలు చేయాల్సిన కంపెనీలు..
గ్రామ పంచాయతీలను అందించాల్సిన ట్రాక్టర్ కంపెనీలను రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మహేంద్ర, స్వరాజ్, ఐషర్, జాండీర్, ఫెర్గుజన్, ప్రీత్, కుబుట, హెఎంటీ తదితర కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీ ట్రాక్టర్ కెపాసిటీని కూడా ఉత్తర్వులో పేర్కొంది. గ్రామ పంచాయతీ పరిధిలో జనాభాను పరిగణలోకి తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేయాలని తెలిపింది.

కొనుగోలు ఇలా..
500 లోపు జనాభా గల గ్రామ పంచాయతీకి 15 హెచ్‌పీ, 501 నుంచి 3 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 20,21 హెచ్‌పీ, 3వేలకు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి 35 హెచ్‌పీ నుంచి ఆపై కెపాసిటీ గల ట్రాక్టర్ ఉండాలని వెల్లడించింది.

ప్రతిపాదనలు సిద్ధం..
జిల్లాలో మొత్తం 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఆలేరు మండలంలోని కొలనుపాకలో, చౌటుప్పల్ మండలంలోని డి నాగారం, వలిగొండ మండలంలోని ఆరెగూడెం గ్రామ పంచాయతీలలో ఇప్పటికే ట్రాక్టర్లు అందుబాటులో ఉండగా, మరో 418 ట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. వీటిలో ఏ గ్రామ పంచాయతీకి ఎంత కెపాసిటీ ట్రాక్టర్ అవసరమనేది పంచాయతీ శాఖ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ట్రాక్టర్ల కొనుగోలులో ప్రభుత్వం నిబంధనలను ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం, గ్రామ కార్యదర్శులు, గ్రామస్తులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన ట్రాక్టర్ల కంపెనీలు పేర్లను సైతం వివరిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు సంబంధించిన కెపాసిటీ, కంపెనీపై అభిప్రాయాలు సేకరించే దిశలో ముందుకు వెళ్తున్నారు. కొనుగోలు చేసే సమయంలో గ్రామపంచాయతీ నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించాల్సి ఉం టుంది. అనంతరం ప్రతిఏటా 14వ ఆర్థిక సంఘం లేదా జీపీ నిధుల నుంచి మిగతా రుసుం చెల్లించాలని ప్రతిపాధించారు.

నిధుల సేకరణ..
ట్రాక్టర్ల కొనుగోలుకు కావాల్సిన నిధులపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టారు. కొనుగోలుకు గ్రామ పంచాయతీలో అవసరమైన నిధులు ఉన్నాయా..? లేకపోతే ఏ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటారు, ఏ పద్దతిన తిరిగి బ్యాంకుకు చెల్లింపులు జరుపుతారు.. తదితర అంశాలపై కూడా గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇవన్నీ గ్రామ పంచాయతీల నుంచి అందిన తరువాత పంచాయతీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు. ట్రాక్టర్ కొనుగోలు కోసం అప్పు అవసరమైన గ్రామ పంచాయతీలకు సబంధించి కలెక్టర్ బ్యాంకర్లతో మాట్లాడుతారు. జిల్లా స్థాయి కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు జరుగుతుంది. ఈ నెల 25 తేదీలోగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కమిటీ చైర్మన్‌గా కలెక్టర్..
గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయనున్న ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ అనితారామచంద్రన్, కన్వీనర్‌గా డీపీవో జగదీశ్వర్ వ్యవహరిస్తారు. డీఆర్‌డీవో, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిశ్రమల అధికారులు సభ్యులుగా ఉంటారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...