టీఆర్‌ఎస్ మండల నాయకుడికి పితృవియోగం


Sat,October 19, 2019 11:11 PM

బొమ్మలరామారం : మండలంలోని పెద్దపర్వతాపూర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ మం డల సీనియర్ నాయకుడు పిట్టల పాండు తండ్రి అం జయ్య(90) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. దీంతో పలువురు టీఆర్‌ఎస్ మండల నాయకు లు మృతదేహాన్ని సం దర్శించి కుటుంబసభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు వారు మాట్లాడుతూ.. గత 60 ఏండ్ల కిందట పచ్చదనమే లక్ష్యంగా తన వ్యవసాయపొలంలో విరివిగా వివిధ రకాల పండ్లు, ఇత ర మొక్కలను నాటి మహావృక్షాలుగా తయారుచేసిన అంజ య్య ప్రకృతి సేవకుడన్నారు. ఆయనను ఆదర్శంగానే గ్రామంలోని ఇతర రైతులు చెట్లను పెంచడంలో ఆసక్తిని చూపారన్నారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డబోయిన లక్ష్మీనర్సయ్య, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు ఎల్లబోయిన రవిశంకర్, టీఆర్‌ఎస్ మండల నాయకులు ఈగల బాల్‌రాజ్, జింక నరేందర్, ప్రభాకర్‌గౌడ్, బానాల బాల్‌నర్సింహ, రాములు, జగన్నాథం, వెంకటేశ్, రాంగోపాల్, రమేశ్, పలువురు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...