యాదాద్రిలో భక్తుల కోలాహలం


Sat,October 19, 2019 11:11 PM

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కలల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నా రు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయ స్వామివారిని సహస్రనామార్చన చేశారు. శ్రీసత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 9,56,487 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 9,56,487 ఆదాయం సమకూరినట్లు ఆదాయశాఖాధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1,43,538, రూ. 150ల దర్శనంతో 63,100, ప్రసాద విక్రయాలతో రూ. 3,75,765 , వ్రత పూజలతో రూ. 69,500, కల్యాణకట్టతో రూ. 26,000, టోల్‌గేట్ ద్వారా రూ. 1, 300, శాశ్వత పూజలతో రూ. 10,232, అన్న ప్రసాదంతో రూ. 18,595, వాహన పూజలతో రూ. 19,700, ఇతర విభాగాలతో రూ. 2,28,757 కలిపి మొత్తం రూ. 9,56,487 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.

స్వామిని దర్శించుకున్న రాఘవేంద్ర స్వామిజీ..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని శనివారం భీమన్నగట్ట మఠం స్వామిజీ రాఘవేంద్ర స్వామిజీ దర్శించుకున్నారు. మధ్యాహ్నం సమయం లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు స్వామిజీకి స్వామివారి తీర్థ్ధప్రసాదాలు అందజేశారు.

స్వామివారికి ఒడిబియ్యం సమర్పించుకున్న స్వీజ్జర్‌లాండ్ దేశస్తురాలు క్రిస్టేనియా
యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారికి స్వీజ్జర్‌లాండ్ దేశస్తురాలు క్రిస్టేనియా శనివారం ఒడి బి య్యం సమర్పించుకున్నారు. సంప్రదాయ దుస్తు ల్లో వచ్చిన క్రిస్టేనియా స్వామి వారిని దర్శించుకుని ఒడి బియ్యం సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 36 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న దేవస్థానా లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నానని ఆమె తెలిపారు. ప్రతి ఏటా దేశంలో ప్రతి దేవాలయాలను సందర్శిస్తానని చెప్పారు.సందర్భంగా ఆమెకు అర్చకులు స్వామివారి తీర్థ్ధప్రసాదాలు అందజేశారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...