అండర్ పాస్ బ్రిడ్జీని త్వరిగతిన పూర్తి చేయాలి


Sat,October 19, 2019 11:11 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : రైల్వేగేట్ వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ బ్రిడ్జీని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. శనివారం యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేటకు వెళ్లేదారిలో రైల్వేగేట్ వద్ద జరుగుతున్న అండర్‌పాస్ బ్రిడ్జీ పనులను ప్రభుత్వ విప్ పరిశీలించారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి ఉండే బాహుపేట మధ్యలో రైల్వేలైన్ ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైల్వేలైన్ దాటేందుకు ఏర్పాటు చేసిన అండర్‌పాస్ బ్రిడ్జీ పనులు ప్రారంభమైన ఏడాది పూర్తయినా ఇంత వరకు పనులు పూర్తి కాలేదని ఒకింత కాంట్రాక్టర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామానికి వెళ్లే దారి సరిగాలేదని, వెంటనే పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. బ్రిడ్జీ పూర్తయ్యేవరకు గ్రామస్తులకు ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాహుపేట సర్పంచ్ కుండే పద్మానర్సయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...