రాష్ట్ర స్థాయి లీడ్ ఇండియా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు


Sat,October 19, 2019 11:11 PM

ఆలేరురూరల్ : లీడ్ ఇండియా 2020 సంవత్సరానికి గాను డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం 88వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్ భవనంలో లీడ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుల చేతిమీదుగా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన ప్రతిభ టాలెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాదె సోమిరెడ్డి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య, టస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌రెడ్డి, రాజాబహదూర్ వెంకట్‌రాంరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి, గాంధీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

రఘుసురేశ్‌కుమార్‌కు
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
భువనగిరి అర్బన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వామోదిత పాఠశాలల సంఘం సంయుక్తంగా హైదరాబాద్‌లోని సుందరయ్య కళాభవన్‌లో అబ్దుల్ కళాం పుట్టిన రోజు సందర్భంగా లీడ్ ఇండియా 2020 పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ రఘు సురేశ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్క రామయ్య, లీడ్ ఇం డియా 2020 అధ్యక్షుడు ఎన్‌బి.సుదర్శన్ ఆచార్య చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...