లింగాకర్షక బుట్టలతో గులాబీ పురుగు నివారణ : ఏఓ


Sat,October 19, 2019 11:10 PM

కట్టంగూర్ : పత్తి చేలల్లో రైతులు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం వల్ల గులాబీ రంగు పురుగు నివారించవచ్చని వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని పామనుగుండ్ల గ్రామంలో శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ రంగు పరుగుల వల్లే చీడ, పీడలు అధికమవుతాయన్నారు.
చిట్యాల : మండలంలోని ఏపూరులో పత్తి రైతులకు మండల వ్యవసాయ అధికారి గిరిబాబు శనివారం లింగార్షక బుట్టలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవి, రైతులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : మండలంలోని దాసరిగూడెంలో పత్తి రైతులకు శనివారం వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ లింగాకర్షక బుట్టలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల అనంతలక్ష్మిరాంరెడ్డి, ఏఈఓలు ఎండీ.లియాకత్ అలీ, విష్ణవర్ధన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...