టీఆర్‌ఎస్‌లో చేరికల పర్వం


Fri,October 18, 2019 11:01 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే యాదాద్రికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని.. రూ. 2 వేల కోట్లతో యాదాద్రి టెంపుల్‌సిటీని తిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు పట్టణవాసులు రుణపడి ఉండాలని చెప్పారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన సుడుగు సుధారాణి నాయకత్వంలో 500 మంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

టెండరు ప్రక్రియకు కొనసాగుతున్నదని, మరో 15 రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల మరమ్మతులు, సీసీ రోడ్లు, ఇతర కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రవహిస్తున్న అతిపెద్ద మురుగు కాల్వను పునరుద్ధరిస్తామన్నారు. అందుకు రూ.6 కోట్లు కేటాయించి కాల్వకు సైడ్‌వాల్స్, ఆధునీకరణ పనులు చేపడుతామన్నారు. ప్రతి వీధికి సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రధాన రోడ్లకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. యాదగిరిగుట్ట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. ఆ పార్టీతో ప్రజలకు ఒరిగేదేమీలేదని చెప్పారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 12 కౌన్సిలర్లుగా టీఆర్‌ఎస్ సభ్యులే గెలుస్తారన్నారు. మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. పార్టీలో పనిచేసేవారికి సరైన సమయంలో తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు మిట్ట వెంకటయ్య, సీస కృష్ణాగౌడ్, పేరబోయిన సత్యనారాయణ, ఎరుకల హేమేందర్‌గౌడ్, అనురాధ, ముక్కెర్ల ఆండాలు, వీరేశ్, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, కీసరి బాలరాజు, సుక్కల సత్యం, వడ్డెరి వెంకటయ్య, బిట్టు కుమార్, అంకం నర్సింహ, రమేశ్, నువ్వల రమేశ్‌గుప్త, వంగపల్లి అరుణ్, కాటేకర్ పవన్, గోపగాని ప్రసాద్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరివారు వీరే..
యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన సుడుగు సుధారాణి ఆధ్వర్యంలో 500 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిలో సుడుగు రామకృష్ణారెడ్డి, తాళ్ల మధుసూదన్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుడుగు కృష్ణారెడ్డి, సంతోశ్‌రెడ్డి,కాంతరావు, దుర్గయ్య, మహేశ్, రవీందర్‌రెడ్డి, నర్సింహ, వెంకటేశ్, భాగ్యలక్ష్మి, విజయ, కిశోర్, నవీన్, శ్రీను, సుడుగు రజిత, బొల్లంపల్లి సంపత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...