పంటలకు సోకే చీడ పీడలపై అప్రమత్తంగా ఉండాలి


Fri,October 18, 2019 11:01 PM

ఆలేరురూరల్ : పంటలకు సోకే చీడ పీడలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు అన్నారు. శుక్రవారం మండలంలోని తూర్పుగూడెం, గొలనుకొండ, కొలనుపాక గ్రామాల్లో వ్యవసాయశాఖతో పాటు ఏరువాక కేంద్రం నల్లగొండ శాస్త్రవేత్తలు గ్రామాల్లో రైతులు వేసిన వరి, పత్తి, కంది పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిల్వ ఉండి మొక్కలు పోషకాలు తీసుకోలేని స్థితికి వచ్చాయన్నారు. ఆరుతడి పంటపొలాల్లో ముందుగా కాల్వలు ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు పంపాలన్నారు. పంటకు సోకే చీడపీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు జి.మధు, బి.మధుశేఖర్, ఆలేరు ఏడీఏ వెంకటేశ్వర్‌రావు, ఏవో లావణ్య, సర్పంచులు వంగాల శ్రీశైలం, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...