బంద్‌కు ప్రజలంతా సహకరించాలి..


Thu,October 17, 2019 11:04 PM

బీబీనగర్ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈ నెల 19న జరుగనున్న తెలంగాణ బంద్‌కు ప్రజలందరూ సహకరించి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్యామ్‌గౌడ్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాస్కర్‌రెడ్డి, దండెం ప్రభాకర్, యువ తెలంగాణ నాయకులు చింతల లక్ష్మీనారాయణ, సామల ప్రవీణ్‌రెడ్డి, సీపీఎం నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బండారు శ్రీరాములు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలి..
భూదాన్‌పోచంపల్లి : నెల 19న నిర్వహించే తెలంగాణ బంద్‌లో ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ మండల కన్వీనర్ బొడ్డు యాదయ్య పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ కృష్ణ, రుద్ర జ్ఞానేశ్వర్, విడెం సుదర్శన్, బి.మహిపాల్‌రెడ్డి, శంకర్, చిక్క కృష్ణ, చింతల శ్రీశైలం, గడ్డం వెంకటేశం, పగిళ్ల లింగారెడ్డి, రావుల యాదగిరి, ఎం.మధు, జంగారెడ్డి, బాలం రామకృష్ణ, పాండాల మహేశ్వర్, శ్రీనివాస్, ఉమాశంకర్ పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...