గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి


Thu,October 17, 2019 11:04 PM

బీబీనగర్ : గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ కోరారు. పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని రాయరావుపేట గ్రామంలో దాతల సహకారాలతో నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఎలక్ట్రికల్ చెత్త సేకరణ వాహనాలను గురువారం ఎంపీపీ ప్రారంభించారు. వాహన కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని అందించిన గ్రామ కో-ఆప్షన్ సభ్యుడు తిరుపతిరెడ్డిని ఎంపీపీ సుధాకర్‌గౌడ్, సర్పంచ్ బొర్ర సంతోషారమేశ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దీంతోపాటుగా దోమల నివారణకై నూతనంగా కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించి గ్రామంలో పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఆర్థికంగా స్థిరపడి బయటి ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కృషి చేయడంతోపాటు గ్రామానికి వచ్చే ఆదాయ వనరులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

వెంకిర్యాలలో..
మండలంలోని వెంకిర్యాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ చెత్త సేకరణ వాహనాన్ని సర్పంచ్ అరిగె సుదర్శన్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, కో-ఆప్షన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...