రికార్డు స్థాయిలో మద్యం టెండర్లు


Thu,October 17, 2019 11:04 PM

వలిగొండ : మండల కేంద్రంలోని వైన్స్‌లకు రికార్డు స్థాయిలో మద్యం టెండర్లు నాలుగు వైన్స్‌లకు 167 టెండర్లు దాఖలైనట్టు మోత్కూర్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే అత్యధికంగా వలిగొండ మండల కేంద్రంలోని 4వ షాపునకు 47 మంది టెండర్లు వేసి తమ అదృష్టాన్ని లక్కీ డీప్ ద్వారా పరిక్షించుకోనున్నారు. మోత్కూర్ మండలంతోపాటు వలిగొండ, అడ్డగూడూర్, ఆత్మకూర్ మండలాలు మోత్కుర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. మోత్కుర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయ పరిధిలో మొత్తం 316 మద్యం టెండర్లు దాఖలైనట్లు తెలిపి, ఒక్క వలిగొండ మండలం నుంచి 167 టెండర్లు రాగా మిగతా మూడు మండలాలైన మోత్కూర్, అడ్డగూడూర్, ఆత్మకూర్ నుంచి కేవలం 149 టెండర్లు మాత్రమే దాఖలైనట్టు తెలిపారు. వలిగొండ మండలంలో ఇంత తీవ్రమైన పోటీ ఉండటానికి కారణం మద్యషాపుల యజమానులు సిండికేట్ వ్యాపారంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలో బెల్ట్‌షాపుల ద్వారా ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు జోరుగా విక్రయించి దండిగా లాభాలు గడిస్తున్న ఏకైక కారణంతోనే మద్యం టెండర్లలో విపరీతమైన పోటీ నెలకొన్నట్టుగా మండల ప్రజలు, మద్యం ప్రియులు చర్చించుకుంటున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...