మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం


Thu,October 17, 2019 11:03 PM

బీబీనగర్ : భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎన్నికైన మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొలను లావణ్యదేవేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, బీబీనగర్ పట్టణ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఆమెను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి పోచంపల్లి చౌరస్తాలో బాణాసంచా కాల్చి కార్యకర్తలకు స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా లావణ్యదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండలంలో తనకు అండగా నిలిచిన ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డితోపాటు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. అనంతరం మండలంలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన మాధారం రాంకుమార్ డైరెక్టర్‌గా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొంతం లింగయ్యగౌడ్, మాజీ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తంతరపల్లి అంజయ్యగౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పిట్టల శ్యామలాశ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు ఎలుగుల నరేందర్ నాయకులు ఉపాధ్యక్షులు కాసుల సత్యనారాయణగౌడ్, గూదె శ్రీశైలం, కొంతం భాస్కర్‌గౌడ్, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, నాయకులు గూడూరు మహిపాల్‌రెడ్డి, పంజాల రామాంజనేయులు, పంజాల బాల్‌రాజుగౌడ్, జక్కి నగేశ్, బద్దం శేఖర్‌రెడ్డి, గుంటిమీది అశోక్, దొంతిరెడ్డి శ్రీనివాస్, బుయ్య కిషోర్‌గౌడ్, రాగి జగదీశ్వర్, డబ్బికార్ రాజేశ్వర్, రమేశ్, నరహరి, గోడల్ల బాల్‌రాజు, సందీప్, మల్లికార్జున్, శివ, అమరేందర్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...