69 షాపులు..1620 దరఖాస్తులు


Wed,October 16, 2019 11:49 PM

-ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ
-18న లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు
భువనగిరి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం మద్యం దుకాణాలకు ఏర్పాటు చేసిన దరఖాస్తు ప్రక్రియకు బుధవారం తెరపడింది. జిల్లాలో 69 మద్యం దుకాణాలకుగాను గతేడాది కన్నా ఈ సంవత్సరం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో చివరి రోజు 1620 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. జిల్లాలోని నాలుగు సర్కిళ్ల పరిధిలోని 69 మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియలో భాగంగా 213 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. అత్యధికంగా వలిగొండ పట్టణంలోని 4 షాపుకు 47 దరఖాస్తులు, అత్యల్పంగా పోచంపల్లి మండలంలోని జూలూరులోని మద్యం షాపుకు 9 దరఖాస్తులు వచ్చాయన్నారు. 69 మద్యం షాపుల దరఖాస్తుతో రూ.32,40,00000 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు.

గతేడాది కన్నా పెరిగిన మద్యం దరఖాస్తులు..
మద్యం దరఖాస్తులు గతేడాది కన్నా ఈ సంవత్సరం బాగా పెరిగాయి. గత సంవత్సరం 1130 దరఖాస్తులు రాగా, ఈ సంవత్సర 1620 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు సర్కిళ్లకు సంబంధించి అత్యధికంగా భువనగిరి సర్కిల్‌లో 506 మంది దరఖాస్తులు చేసుకోగా, మోత్కూర్ సర్కిల్‌లో 361 మంది మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పించారు.

నాలుగు సర్కిల్‌లలో 1620 దరఖాస్తులు దాఖలు..
జిల్లాలోని నాలుగు సర్కిళ్ల పరిధిలోని భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూరు సర్కిళ్లలో మొత్తం 1620 మద్యం దరఖాస్తులు వచ్చాయి.
భువనగిరి సర్కిల్ పరిధిలో 506 దరఖాస్తులు, రామన్నపేట సర్కిల్‌లో 931 దరఖాస్తులు, ఆలేరు సర్కిల్‌లో 362 దరఖాస్తులు, మోత్కూర్ సర్కిల్‌లో 361 దరఖాస్తులు రాగా, 213 మంది మహిళలు మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియలో పాలు పంచుకోవడం కొసమెరుపు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...