ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కాపర్ వైరు చోరీకి యత్నం


Wed,October 16, 2019 10:55 PM

మోత్కూరు : వ్యవసాయ బావులకు విద్యుత్‌ను సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌లో నుంచి కాపర్ వైరు తీసేందుకు గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. మంగళవారం రాత్రి మోత్కూరు మండలం అనాజీపురం గ్రామానికి చెందిన కొల్లు శంకరయ్య వ్యవసాయ బావి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరాను ఆఫ్ చేసి కాపర్ వైరును తీసుకెళ్లేందుకు కొంత మంది దుండగులు ప్రయత్నం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న పై మూత భాగంలోని నట్లను కొన్ని తీశారు. మిగతా కొన్ని నట్లు రాక పోవడంతో దుండగులు చోరీకి యత్నించారు.

బుధవారం ఉదయం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడం తో రైతులు కొల్లు శంకర్యయ, తడిసిన అమృతారెడ్డి, డెంకల రవి, మరి కొందరు అక్కడికి వెళ్లి చూ శారు. దీంతో దుండగులు చేసిన తతంగం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని రైతులు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అక్కడికి వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను సందర్శించి పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా కొత్త నట్లు తెచ్చి ట్రాన్స్‌ఫార్మర్ బిగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం రైతులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపాలు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...