కంపచెట్లను తొలగించాలని వినతి


Wed,October 16, 2019 10:55 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ పైళ్ల జయప్రకాశ్‌రెడ్డికి దాతారుపల్లి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ నర్సింహారెడ్డిని కలిసి వినతిని ఇచ్చారు. యాదగిరిగుట్ట నుంచి దాతారుపల్లికి వెళ్లేదారిలో పాతగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు ఉన్నాయి. దీంతో దారిలో వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నాదని వినతిలో తెలిపారు. పలుమార్లు ప్రమాదాలు సైతం సంభవించాయని వెంటనే కంప చెట్లను తొలగించాలని కోరారు. వినతిపత్రం అందజేసినవారిలో దాతారుపల్లి ఎంపీటీసీ కాల్నె ఐలయ్య, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని నాగరాజుగౌడ్, జంగంపల్లి టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సున్నం లక్ష్మయ్య, నాయకులు సూదగాని నరసింహాగౌడ్, వార్డు సభ్యులు కాల్నె వెంకటేశ్, మేకల వెంకటేశ్, ధీరావత్ చందర్, టీఆర్‌ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు గనెగండ్ల నరేశ్‌గౌడ్, చుక్కల స్వామి, గొర్ల ఐలయ్య టీఆర్‌ఎస్ మండల నాయకులు చంద్రగోని జహంగీర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...