భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ


Wed,October 16, 2019 10:55 PM

-నూతన పాలకవర్గం ఎన్నిక
భువనగిరి అర్బన్: భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు పాలకవర్గం ఖరారైంది. 2017 ఫిబ్రవరి 2వ తేదీన నియమించిన మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు 2018 ఫిబ్రవరికి ముగిసింది. కాగా ఇదే పాలకవర్గాన్ని మరో ఏడాది కొనసాగిస్తూ 2019 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. అయితే గత ఫిబ్రవరిలో గడువు ముగిసినా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నూతన పాలకవర్గం నియామకం ఆలస్యమైంది. కాగా బుధవారం భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం ఖారారైంది. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాలు, ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండలంతో కలిపి భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, 8 మంది డైరక్టర్లతో పాటు పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, స్పెషల్ ఆఫీసర్‌గా మున్సిపల్ చైర్మన్ పాలక వర్గంలో ఉంటారు.

పాలకవర్గం వివరాలు...
భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా భువనగిరి మండలం కూనూరుకు చెందిన అబ్బగాని వెంకట్‌గౌడ్, మెంబర్లుగా భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన కట్కూరి జంగయ్యగౌడ్, బీబీనగర్ మండలం వెంకిర్యాలకు చెందిన మాదారం రామ్‌కుమార్, భూదాన్‌పోచంపల్లి మండలం ఇందిరాలకు చెందిన నోముల మాధవరెడ్డి, జూలూరుకు చెందిన ఐతరాజు భిక్షపతి, బొమ్మలరామారం మండలం లక్ష్మితండాకు చెందిన ధీరావత్ శ్రీనివాస్, హాజిపూర్‌కు చెందిన రామిడి రాంరెడ్డి, భువనగిరి పట్టణానికి చెందిన జెల్ల వెంకటరమణ, పొద్దుటూరి ప్రశాంత్‌కుమార్, ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా చందుపట్ల పీఏసీఎస్ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జిల్లా మార్కెంటిగ్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ చైర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...