వీరారెడ్డిపల్లిలో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ కేంద్ర బృందం సర్వే


Wed,October 16, 2019 10:54 PM

తుర్కపల్లి : మండలంలోని వీరారెడ్డిపల్లిలో బుధవారం జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) బృందం సభ్యులు సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ.. పరిసరాల పరిశుభ్రత పారిశుధ్య పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, మురుగు కాల్వల నిర్వాహణ పనితీరు, గ్రామ పంచాయితీ పనితీరు, రేషన్‌కార్డుల పంపిణీ, కుటుంబ నియంత్రణ, ప్రసవాలు, కేసీఆర్ కిట్టు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్ల పనితీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 22 కుటుంబాలను ఎంచుకొని బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సర్వే వివరాలను జాతీయ హెల్త్‌మిషన్‌కు అందజేయనున్నట్లు బృందం సూపర్‌వైజర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో బృందం సభ్యులు శ్రీధర్, నిరజా, సంధ్య, సరిత, వెంకటేశ్, జయప్రద, సర్పంచ్ జక్కుల శ్రీవాణి వెంకటేశ్, ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోపి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...