కల్యాణలక్ష్మి ..పేదింటి వరలక్ష్మి


Tue,October 15, 2019 11:33 PM

సంస్థాన్‌నారాయణపురం : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నది. అందులో ఒకటి కల్యాణలక్ష్మి పథకం. నిరుపేద కుంటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే ఆర్థిక స్థోమతలేక బాధపడుతున్నారని భావించి వారికి ఆర్థికంగా సహాయసహకారాలు అందిచాలని కల్యాణలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆడబిడ్డ పెళ్లి అంటే భయపడే రోజల నుంచి సంతోషంగా ధైర్యంగా పెళ్లి చేయాలన్న ఆలోచనల వైపు ఈ పథకం నడిపిస్తున్నది. ఆడపిల్ల సంతోషంగా పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లడానికి ఈ పథకం దారిచూసుతున్నది. ఈ పథకం ప్రవేశపెట్టినపుడు మొదటగా రూ 51 వేలతో ప్రారంభించడం జరిగింది అనంతరం కొంత కాలానికి దానిని రూ. 75 వేలకు పెంచారు. రెండో సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల హామీలో దానిని రూ. 1,00,116గా పెంచుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధ్దిదారులకు లక్షానూటపదహారు రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ఈ సంవత్సరం మొత్తం 80 దరఖాస్తులు స్వీకరించగా అందులో మొదట విడుతగా 17 మంది కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్నారు. విడుతల వారీగా మిగతా వాళ్లకు అందిస్తామని ప్రజాప్రతినిధులు, అదికారులు చెబుతున్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నది. ఇలాంటి మహాత్తరమైన పథకాలను ప్రభుత్వం అందిచడం చాలా ఆనందంగా ఉన్నదని లబ్ధ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...