నిరుపేదలను ఆదుకోవాలి : మాజీ ఎంపీ బూర


Tue,October 15, 2019 11:33 PM

చౌటుప్పల్ రూరల్ : పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు నిరుపేదలను ఆర్థికంగా ఆదుకోవాలని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుంట్లగూడెం గ్రామానికి చెందిన కంచర్ల ఇస్తారి ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడి మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఈఎల్‌ఆర్ ఫౌండేషన్ కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు బీఎల్‌ఆర్ ఫౌండేషన్ స్థాపించానని ఆయన గుర్తు చేశారు. దిని ద్వారా 1.50లక్షల నిరుపేదలకు బీమా చేయించామన్నారు. కేవలం రూ.60 ప్రీమియంతోనే రూ.5లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటికీ ప్రమాదవశాత్తూ మృతిచెందిన 46 మందికి దిని ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. మరో 6గురికి త్వరలోనే ప్రిమియం చెల్లించన్నుట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గిరికి కూడా బీమా వచ్చిందన్నారు. అంతే కాకుండా తాను ఎంపీగా ఉన్నప్పుడు బీబీనగర్‌లో రూ.1000 కోట్లతో ఎయిమ్స్ తీసుకోచ్చానని ఆయన గుర్తు చేశారు. రహదారుల ఏర్పాటుకు కూడా కృషి చేశానన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గిర్కంటి నిరంజన్‌గౌడ్, మున్సిపాలిటీ కన్వీనర్ ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొత్త పర్వతాలు యాదవ్, జిల్లా సభ్యులు ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, గొల్లకురుమ జేఏసీ జిల్లా కన్వీనర్ గుండెబోయిన ఆయోధ్యయాదవ్, నాయకులు వీరమళ్ల వెంకటేశం గౌడ్, ఎండీ.బాబాషరిఫ్, దేవరపల్లి గోవర్దన్‌రెడ్డి, బొడిగే బాలకృష్ణాగౌడ్, ఉష్కాగుల నాగరాజు గౌడ్, పబ్బతి ఆంజనేయులు గౌడ్, దబ్బెటి రాములుగౌడ్, బుట్టి శ్రీనివాస్‌గౌడ్, కంచర్ల ప్రేమ్‌దాస్, గంగాదేవి చెంద్రయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...