అలుగులు దుంకుతున్న చెరువులు


Mon,October 14, 2019 01:02 AM

బీబీనగర్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల చెరువులు నిండుకుండలా మారి అలుగులు దుంకుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మండలంలోని జమీలాపేట్, రాయరావుపేట్, జైనపల్లి చెరువులు నిండి అలుగు దుంకుతుండంతో ఆయా గ్రామస్తులు చెరువుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగితూ సరదాగా గడుపుతున్నారు. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొండమడుగు, బీబీనగర్ పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నది. జియాపల్లి-జమీలాపే ట్ వద్ద అలుగు నిండి రోడ్డుపై నుంచి నీరు వెళ్తుండటంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...