పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు అద్భుతం


Fri,October 11, 2019 11:23 PM

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్ర్తాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి అన్నారు. శుక్రవారం ఆయన సతీసమేతంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ముందుగా గ్రామీణ పర్యాట కేంద్రానికి వెళ్లి చేనేత కళాత్మకతపై ఏర్పాటు చేసిన ఎగ్జిబీషన్ మగ్గాలను తిలకించారు. అనంతరం పోచంపల్లి పట్టణంలోని పలు ప్రఖ్యాత వ్యాపారుల దుకాణాలను సందర్శించి పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్ర్తాలు ఎంతో ప్రాచీనమైన కళతో కూడుకున్నవి అన్నారు. వాటి తయారీ విధానంతోపాటు నేరుగా చేనేత కార్మికుల నుంచే వస్ర్తాలను కొనుగోలు చేయాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. చేనేత వస్ర్తాల డిజైన్లు మగువల మనసును దోచేలా ఉన్నాయన్నారు. ఇక్కడి కార్మికుల కళాదృష్టి ఎంతో గొప్పగా ఉన్నదని కొనియాడారు. సంప్రదాయానికి నిలువుటద్దమైన పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు ప్రతి ఒక్కరూ ధరించి కార్మికులకు బాసటగా నిలువాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలకు ఆదరణ లభిస్తుందంటే అది ఇక్కడి చేనేత కార్మికుల గొప్పతనమే అన్నారు. ఆయనకు ముందుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగరాణి, చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్, పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ బాలశంకర్, చౌటుప్పట్ ఏసీపీ సత్తయ్య, సీఐ పార్థసారధి, ఎస్సై రాజు, మున్సిపల్ మేనేజర్ నల్ల బాలాజీ తదితరులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...