భూగర్భ జలాల పెంపు పనులు భేష్


Fri,October 11, 2019 11:22 PM

రాజాపేట : గ్రామంలో భూగర్భ జలాలు పెంపునకు చేపడుతున్న పనులు భేష్‌గా ఉన్నాయని జలశక్తి అభియాన్ కేంద్ర సభ్యులు అవినాశ్‌మిశ్రా, మనీశ్‌కుమార్, ఆశీష్ అవాస్థి అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని బొందుగులలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ఉపాధిహామీ పథకంలో భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ పనులతో పాటు గ్రామ ఊర చెరువు, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. భూగర్భ జలాలు పెంపునకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని గ్రామస్తులను కోరారు. నీరు ఆదా, పచ్చదనం పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, ఏపీడీ శ్యామల, ఎంపీడీవో రామరాజు, పీవో ఇనాయత్ అలీ, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో పరశురాం, గ్రామస్తులు ఉన్నారు.

తిరుమలాపూర్ సందర్శన..
తుర్కపల్లి : కేంద్ర జలశక్తి అభియాన్ బృందం సభ్యులు శుక్రవారం మండలంలోని తిరుమలాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన చెక్‌డ్యాం పూడికతీత పనులను పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్ రీచార్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు అవినాశ్ మిశ్రా, మనీశ్‌కుమార్, ఆశీష్ అవాస్థిలు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి నిలువలను పెంపొందించి భూగర్భ జలాలు పెరిగేలా ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను నిర్మించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాధికారి ఉపేందర్‌రెడ్డి, ఏపీడీ శ్యామల, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ నామసాని సత్యనారాయణ, ఈసీ కరుణాకర్, ఉపాధి సిబ్బంది చంద్రశేఖర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...