యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శ న సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తు లు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.యాదాద్రి ఆలయంలో అత్యం త ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 37, 000ల ఆదాయం సమకూరిం ది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారు.
శ్రీవారి ఖజానాకు రూ. 7, 57, 267 ఆదాయం..
శ్రీవారి ఖజానాకు రూ. 7, 57, 267ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1, 08, 592, 100 రూపాయల టికెట్‌తో రూ. 57, 700, కల్యాణకట్ట ద్వారా రూ. 21, 400, ప్రసాదవిక్రయాలతో రూ. 3, 07, 390, ఇతర విభాగాలతో రూ. 1, 94, 456 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.