ఆత్మకూరు(ఎం) : చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం బుధవారం మండలంలోని టీ.రేపాకలో శివాజీ యూత్‌క్లబ్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. దాతల సహకారంతో గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శివాజీ యూత్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు తిక్క పరశురామ్, అధ్యక్ష, కార్యదర్శులు కట్టెకోల నరేశ్, కడకంచి కిరణ్, ఉపాధ్యక్షుడు గూడూరు సందీప్‌రెడ్డి, కోశాధికారి కోట సందీప్, కన్వీనర్ మూల ప్రవీణ్, కో-కన్వీనర్ చింతల నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.