ప్రభుత్వ విప్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Mon,October 7, 2019 11:44 PM

బొమ్మలరామారం : కంచల్‌తండా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.15 కోట్లు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం తండాలో టీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమె చిత్రటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. చీకటిమామిడి నుంచి తండా వరకు రెండున్నర కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నిధులు మంజూరు చేసిందన్నారు. ఎంతో కాలంగా తండాకు సరైన రోడ్డు మార్గం లేక తండావాసులు పడుతున్న ఇబ్బందులు గమనించి నిధులు మంజూరు చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తండాలకు మహర్దశ వచ్చిందన్నారు. పల్లె ప్రగతియే లక్ష్యంగా 30 రోజుల ప్రణాళిక కార్యాచరణతో పల్లెలు, తండాలు అద్భుతంగా రూపొందుతున్నాయన్నారు. తండా సమస్యలపై ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు గూదె బాల్ నర్సింహ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, సర్పంచ్ ధీరావత్ లక్ష్మణ్‌నాయక్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాడోత్ రాజ్‌కుమార్, సోలిపేట సర్పంచ్ పూడూరి నవీన్‌గౌడ్, మండల నాయకులు గోలిపల్లి పోశంరెడ్డి, కట్ట శ్రీకాంత్‌గౌడ్, బండి మహేశ్‌గౌడ్, నిరుగొండ రమేశ్‌గౌడ్, పుడూరి ఆంజనేయులుగౌడ్, నాయకులు ధీరావత్ సుమన్‌నాయక్, మహేందర్, మోహన్, వినోద్, పరమేశ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, లక్ష్మణ్, రమేశ్, చంద్ర, నరేశ్, లడ్డు, మాణిక్‌రాజు, చింటు, తండావాసులు తదితరులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...