రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం


Mon,October 7, 2019 11:43 PM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్త జనులు పరవశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివునికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకం అయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు.

ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాబిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితులు గౌరీబట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహా యాగములో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు నిత్య కళ్యాణోత్సవం జరిపించారు. దేవీనవరాత్రుల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కుంకుమార్చన నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన నిర్వహించనున్నారు. 5గంటలకు శమీ పూజ విజయదశమి వేడుకులు నిర్వహిస్తారు.

శ్రీవారి ఖజానాకు రూ.3,65,391 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ.34,484 ప్రసాద విక్రయాలతో రూ. 1,52,830తో పాటు ఇతర విభాగాలతో రూ. 92,727 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...