శివ కుటుంబాన్ని ఆదుకున్నతోటి డ్రైవర్లు


Mon,October 7, 2019 11:43 PM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తమతో పాటు కలిసి ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న భువనగిరి హన్మాన్‌వాడకు చెందిన డ్రైవర్ శివ జ్వరంతో బాధపడుతూ ఊహించని విధంగా మృతి చెందడంతో తెలంగాణ ఎక్సైజ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన డ్రైవర్లంతా కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. రూ.68,000 విరాళాలు పోగు చేసి సోమవారం శివ భార్య మాధురి, తల్లి పద్మకు అంద జేశారు. అనంతరం అసోసియేషన్ నాయకులు శంకర్, శివ, నరేందర్ మాట్లాడుతూ శివ కుటుంబానికి అండగా ఉంటా మన్నారు. మరోవైపు అతి పేదకుటుంబానికి చెందిన గుర్రం శివ కుటుంబానికి డ్రైవర్లు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటిన యూనియన్ నాయకులను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, సీఐ నాగిరెడ్డి అభినందించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...