అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్


Mon,October 7, 2019 11:42 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందిస్తామని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వ నిబంధనలకు లోబడి కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని వివరించారు. జర్నలిస్టులు మాకు కార్డులు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతున్నదని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కార్డులు జారీ చేసే ప్రక్రియను ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. జేసీ జీ. రమేశ్ మాట్లాడుతూ దసరా పండుగకు ముందు రోజు జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన కార్డులను ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. టీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు, అక్రిడిటేషన్ సభ్యుడు గొట్టిపర్తి భాస్కర్ మాట్లాడుతూ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా అందించినందుకు జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మండల స్థాయి విలేఖరులకు కూడా త్వరగా కార్డులు అందజేయాలని, తక్షణ అవసరాలు ఉన్న జర్నలిస్టులు కూడా ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షుడు గుజ్లు కృష్ణారెడ్డి, యంబ నర్సింహులు, రాష్ట్ర నాయకుడు ఖాజామొయినుద్దిన్, టెమ్జు జిల్లా కార్యదర్శి కిరణ్, మల్లేషం, ఉమామహేశ్వర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...