గబ్బర్‌సింగ్ సినిమా నటుడి సందడి


Mon,October 7, 2019 12:42 AM

రాజాపేట : తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన లడ్డుబాయ్ ఆదివారం మండలంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మండలంలోని సింగారంలో విలేజ్ వీడియో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దసరా సంబురాలు షార్ట్ ఫిల్మ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఉంటానని, పెద్దగా చదువుకోలేదని తెలిపారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో నటుడు శ్రీహరి సహకారంతో సినీరంగలోకి ప్రవేశించానని తెలిపారు. ప్రేమలో పావణీకల్యాణ్ చిత్రంలో మొదటి సారిగా విలన్‌పాత్ర నటనకు అవకా శం వచ్చిందని, బైరవ, అన్నవరం, గబ్బర్‌సింగ్, సింహం, బా హుబలి, సర్దార్ గబ్బర్‌సింగ్, యుగానికి ఒక్కడుతో పాటు 25 పైగా సినిమాలల్లో నటించానని తెలిపారు. డైరెక్టర్ నల్ల శ్రీనివాస్ తన ఆప్త మిత్రుడని అతను నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్ ప్రారంభోత్సవాని వచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట పటాస్ షార్ట్ ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్, నటినటులు ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...