ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా టీఆర్‌ఎస్


Mon,October 7, 2019 12:42 AM

బీబీనగర్ : అనారోగ్య సమస్యలరిత్యా చికిత్సలు పొందిన వారికి ఆసరాకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రాగీరు శశిధర్‌గౌడ్ కు మంజూరైన రూ.1లక్ష చెక్కును ఆదివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అనారోగ్యరిత్యా మెరుగైన వైద్యం పొందిన వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ఇప్పటికే కొన్ని లక్షల మందికి బాసటగా నిలిచిందన్నారు.

ఆపద సమయంలో వారికి నేనున్నానని సీఎం సీఆర్ అభయమిస్తున్న విషయం గుర్తించాలన్నారు. అలాగే కొం డమడుగు గ్రామానికి చెందిన వాకిటి రఘుపతిరెడ్డికి మంజూరైన రూ. 4లక్షల ఎల్‌వోసీ చె క్కును ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోళి పింగళ్‌రెడ్డి, బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కా ర్యక్రమంలో వైస్ ఎంపీపీ వాకి టి గణేశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ వాకిటి సంజీవరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు అక్బర్, పార్టీ మండల కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు వాకిటి సత్యనారాయణ, దేశం శ్రీకాంత్, మీసాల రాములు, బండమీది బాల్‌నర్సింహ్మ, గాండ్ల బాల్‌రాజు, బద్దం శేఖర్‌రెడ్డి, జక్కి నగేశ్, మేకల మహేశ్‌గౌడ్, పెంటబోయిన వేణు, బండమీది భాస్కర్, మీసాల కొండల్, రాగీరు రాజుగౌడ్, యాదగిరి, గొలనుకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...