స్వచ్ఛమైన పాలను అందించే ఏకైక సంస్థ మదర్ డెయిరీ


Mon,October 7, 2019 12:42 AM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : స్వచ్ఛమైన పాలను అందించే ఏకైక సంస్థ మదర్ డెయిరీ అని ఆ సంస్థ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో నార్మూల్ మదర్‌డెయిరీ పార్లర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పాడి రైతుల ద్వారా సేకరించిన పాలను 24 గంటల శుద్ది చేసి కస్టమర్లకు అందజేస్తామన్నారు. మార్కెట్‌లో తక్కవ ధరకు లభించే కల్తీ పాలను వాడకూడదన్నారు. స్వచ్ఛమైన మదర్‌డెయిరీ పార్లర్‌లను రాబోయే రోజుల్లో మరింతగా విస్తరింపజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మదర్‌డెయిరీ ఎండీ రమేశ్, మదర్‌డెయిరీ డైరెక్టర్లు శ్రీశైలం, వెంకట్రామిరెడ్డి, కాయితి వెంకట్‌రెడ్డి, గాల్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్లు జీవీఎస్ రెడ్డి, లక్ష్మీనారాయణ, లకా్ష్మరెడ్డి, శ్రీ యాదాద్రి పార్లర్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...