యాదాద్రికి మహర్దశ


Mon,October 7, 2019 12:41 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: రానున్న కొద్ది ఏండ్లలోనే యాదాద్రి ఆలయంతో పాటు యాదగరిగుట్ట పట్టణం కూడాఎంతో అభివృద్ధి చెందనున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట శివారులోగల గంగసానిపల్లిలో తన వియ్యంకుడు శ్రీధర్‌రెడ్డి నూతన గృహ ప్రవేశం సందర్భంగా నిర్వహించిన శ్రీసత్యనారాయణ వ్రతపూజలో కుటుంబ సభ్యులతో పాటు ఆయన పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌కు ఉన్న విజన్ మరే నాయకుడికి లేదని, తెలంగాణకే యాదాద్రి తలమానికమైందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండటం వల్ల యాసంగి సీజన్‌కు ఇబ్బందిలేదన్నారు. దశాబ్దాల కాలం ఎలాంటి సాగు నీటి వనరులులేని ఆలేరు, భువనగిరికి బస్వాపూర్, గంధమల్ల ప్రాజెక్టుల నిర్మాణాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. కేసీఆర్ అసాధారణ రీతిలో యాదాద్రిని
అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు నోరోత్తమ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మాజీ ఏడీఏ మహావాది దత్తాత్రేయ, భువనగిరి ఏసీపీ భుజంగరావు, రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...