స్తంభించిన ట్రాఫిక్


Sat,October 5, 2019 11:40 PM

-పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు
-ఇబ్బందులు పడ్డ ప్రజలు
చౌటుప్పల్ రూరల్ : 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి వాహనాల రద్దీ కొనసాగింది. ఈ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దీంతో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. సుమారు ఆర కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. దసరా పండుగ మరో రెండురోజులు ఉండటంతో భాగ్యనగరం నుంచి సొంతూర్లకు ప్రజలు సిద్ధమయ్యారు. దీనికి తోడు ఆర్టీసీ సమ్మే ఉండటంతో వాహనాదారులు ముందుస్తుగా తమ సొంత వాహనాల్లో ప్రయాణాలు సాగించారు. ప్రయాణించిన వాహనాల్లో అధికంగా కార్లు ఉన్నాయి. దీంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ మొత్తం 16 టోల్‌బూత్‌లు ఉండగా నల్లగొండ వైవు 9 బూత్‌లను తెరిచారు. అయినప్పటికీ వాహనాలు కొద్ది సేపు నిలిచిపోయాయి. జీఎమ్మార్ గుత్తేదారు సంస్థ టోల్ గేటు వద్ద వాహనాలు ఎక్కువ సేపు ఆగకుండా చేతి యంత్రాల ద్వారా రశీదు ఇవ్వడానికి 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏసీపీ సత్తయ్య టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణను పరిశీలించారు. సీఐలు వెంకటేశ్వర్లు, జోసఫ్, జీఎమ్మార్ అధికారులు, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ నిలువకుండా జాగ్రత్తలు చేపట్టారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...