క్రీడలతో స్నేహభావం


Sat,October 5, 2019 11:38 PM

మోత్కూరు : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని మోత్కూరు ఎస్సై సీహెచ్ హరిప్రసాద్ అన్నారు. శనివారం పట్టణంలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతత, శారీరక ఎదుగుదలకు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌కు మొదటి బహుమతి, యంగ్‌స్టార్ కొత్తబస్టాండ్‌కు ద్వితీయ బహుమతి, గాంధీనగర్ సీనియర్స్‌కు తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ పోటీల నిర్వాహకులు మెంట రాజు, చెడుపల్లి ఆదిత్య, మెంట స్వామి, మెంట వినోద్, కూరెళ్ల అంకుశం, కూరెళ్ల కుమార్, ఎండీ ఇస్మాయిల్, వేముల సునీల్, కిరణ్, ప్రకాశ్, మందుల శ్రీకాంత్, నరేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...