కల్యాణలక్ష్మి పేదలకు వరం


Sat,October 5, 2019 11:38 PM

సంస్థాన్‌నారాయణపురం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదల పాలిట వరం లాంటిదని ఆర్డీవో సూరజ్‌కుమార్ అన్నారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన 17 చెక్కులను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గుత్త ఉమాప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతీవెంకటేశంగౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. ఆడబిడ్డలకు మేనమామలా నేనున్నానంటూ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు. అలాగే గ్రామాలాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, ఎంపీడీవో, సర్పంచులు దోనూరు జైపాల్‌రెడ్డి, కురుమిద్దె కళమ్మ, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, దోనూరు శ్రావణి, విజయ, రాములమ్మ పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...