తృటిలో తప్పిన ప్రమాదం


Sat,October 5, 2019 11:38 PM

ఆలేరుటౌన్ : ఆలేరు పట్టణం రెడ్డిగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం పోలీస్ వాహనం (టీఎస్ 09 పీఏ 3995) అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్లలోకి దూసుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు నుంచి భువనగిరి వైపు వెళ్తున్న పోలీస్ వాహనం ఆలేరు పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ముళ్లచెట్లలోకి దూసికుపోయి ఆగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అనంతరం పోలీస్ వాహనం తిరిగి భువనగిరి ప్రాంతానికి వెళ్లిపోయింది. ఈ వాహనం షీటీమ్ బృందానికి చెందిందా.. ఎస్‌వోటీ బృందానికి చెందినదా అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఆలేరు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...