భువనగిరిలో భారీ వర్షం


Sat,October 5, 2019 11:38 PM

భువనగిరి నమస్తేతెలంగాణ : భువనగిరి పట్టణ, మండలంలో క్యూములోనింబస్ మేఘాల మూలంగా శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా సుమారు రెండు గంటలపాటు 84 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో నీరు పూర్తిగా నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో మాకోలు పోషయ్యకు చెందిన పాడి బర్రె పిడుగుపాటుతో మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన రైతు పోషయ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మాజీ సర్పంచ్ కొండ స్వామి, టీఆర్‌ఎస్ నాయకులు కొండ నందులు ప్రభుత్వాన్ని కోరారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...