నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం


Sat,October 5, 2019 12:37 AM

భువనగిరి, నమస్తేతెలంగాణ : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా ఉంటుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని అనంతారం గ్రామంలో దాత గుణపాటి శ్రీధర్‌రెడ్డి దాతృత్వంతో రూ.3,60,000తో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతుందని, సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ పూర్తిస్థాయిలో అమలవుతుందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని గుర్తు చేశారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరంగా పనిచేసే నిఘానేత్రం సీసీకెమెరాలు అని అన్నారు. సీసీ కెమెరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణాన్ని సమకూర్చుకునేందుకు సీసీ కెమెరాలు దోహదపడుతాయన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల దాత శ్రీధర్‌రెడ్డిని అభినందించారు. అనంతరం గ్రామంలో హరితహారం కింద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, పీఏఈసీఎస్ చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సామల వెంకటేశం, ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్‌గౌడ్, గ్రామ సర్పంచ్ చిందం మల్లికార్జున్, ఉపసర్పంచ్ విఠల్ వెంకటేశం, మాజీ సర్పంచ్ విఠల్ రఘురామయ్య, వార్డు సభ్యులు కట్కూరి వేణుగౌడ్, బొబ్బల మీనారెడ్డి, గుమ్మల గణేశ్, ఎర్ర చింటూ, లింగాల కృష్ణవేణి, చిగురుపల్లి మంగమ్మ, కళ్లెం ఇందిర, పసల ఆరోగ్యమ్మ, పల్లెపాటి నాగరాణి, కో-ఆప్షన్ సభ్యులు పాలరపు నాందేవ్, పాదరాజు శ్యామ్‌రావు, పొట్ట లావణ్య, గ్రామస్తులు బొట్టు మల్లేశం, చిందం మల్లికార్జున్, పల్లెపాటి అంజయ్య, చిగురుపట్టి సోమయ్య, పోల ప్రవీణ్, మచ్చ రామకృష్ణ, మదిరె వినోద్, గుమ్మల శ్రీను, కళ్లెం కవిత తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...