జిల్లాలో పలుచోట్ల వర్షం


Sat,October 5, 2019 12:37 AM

వలిగొండ : మండలంలోని కొన్ని గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని రెడ్లరేపాక, కంచనపల్లి, మాందాపురం, అక్కంపల్లి గ్రామాల్లో వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి చేను నేలకొరిగాయి. భారీ వర్షం కారణంగా వలిగొండ దాసిరెడ్డిగూడెం గ్రామాల మధ్య కల్వర్టుల మీదుగా వరద నీరు ప్రవహించడంతో కంచనపల్లి, రెడ్లరేపాకకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
వర్షానికి కూలిన ఇల్లు..
వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అంబటి చిన్న సత్తయ్య ఇల్లు కూలిపోయింది. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ బోడ లక్ష్మమ్మాబాలయ్య ప్రభుత్వాన్ని కోరారు.
పట్టణంలో భారీ వర్షం..
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని కొత్త బస్టాండ్, జూనియర్ కళాశాల, పాత బస్టాండ్‌లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...