యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌సేవ


Sat,October 5, 2019 12:37 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే ఊంజల్ సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త...తనను కొలిచిన వారికి నేనున్నానంటు అభయ హస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన నిర్వహించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉపప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మ వారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో అర్జిత పూజల కోలాహలం ..
యాదాద్రిలో అర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానాకు రూ. 4, 82, 890 ఆదాయం..
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 55, 336, 100 రూపాయల దర్శనం టికెట్‌తో రూ.17,000, ప్రసాద విక్రయాలతో రూ. 1, 91, 400, వ్రత పూజలతో రూ.28, 500, ఇతర విభాగాలతో రూ.1, 54, 440 పాటు అన్ని విభాగాల నుంచి రూ. 4, 82, 890 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మేడి శివకుమార్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...